ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై అనుచిత, నిరాధార ఆరోపణలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్(Sanjay)కి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లీగల్ నోటీసులు పంపించారు. ఒక ప్రజాప్రతినిధిపై అర్థం లేని విధంగా మాట్లాడారని, క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులకు సిద్ధం కావాలని హెచ్చరించారు. ఆధారాలుంటే అందజేయాలని, లేదంటే చర్యలకు రెడీగా ఉండాలన్నారు. వారం లోపు కేంద్ర మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా భవిష్యత్తులోనూ తనతోపాటు తమ కుటుంబంపై ఎలాంటి ఆరోపణలు చేయరాదంటూ నోటీసుల్లో తెలిపారు. ఈనెల 8న సిట్ విచారణకు హాజరైన వేళ సంజయ్.. KTRపై ఆరోపణలు చేశారు.