వీధి కుక్కల కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇదిప్పుడు హాట్ టాపిక్ అయింది. దేశంలో కుక్క కాట్లు ఎంతోమంది ప్రాణాలు తీశాయి. ముంబయిలో 2014లో 4,400 ఉంటే 2025కు వాటి సంఖ్య 90,700కు చేరింది. లఖ్నవూలో గత రెండేళ్లలో 10 వేలు, ఛండీగఢ్ లో 2023లో 10,621 కేసులు వచ్చాయి. వాటి నియంత్రణలో నెదర్లాండ్స్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. సర్కారు నిధులతో 70% కంటే ఎక్కువ ఆడ శునకాలకు అక్కడ స్టెరిలైజ్ చేస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే 18,500 డాలర్లు(రూ.15 లక్షల దాకా) ఫైన్ వేస్తారు. కుక్కల కొనుగోళ్లను తగ్గించడానికి ఎక్కువ పన్ను పడుతుంది. దత్తత(Adopt) డ్రైవ్ ద్వారా 90% కంటే ఎక్కువ డచ్ కుటుంబాలు వాటిని దత్తత తీసుకున్నాయి. దీంతో ఆ దేశంలో వీధి కుక్కలే లేకుండా పోగా.. ప్రపంచంలోనే అవి లేని తొలి దేశంగా నిలిచింది.