గవర్నర్ కోటా MLCలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై ‘స్టే’ విధించింది. ప్రభుత్వ తీరుపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పిటిషన్ వేశారు. దీంతో ఆ ఇద్దరి ప్రమాణ స్వీకారాన్ని తప్పుబట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్.. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది. 2023 జులైలో శ్రవణ్, సత్యనారాయణ పేర్లను BRS పంపితే తమిళిసై తిరస్కరించారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు 2024 జనవరిలో కోదండరామ్, అలీఖాన్ ను నామినేట్ చేసింది. తమిళిసై నిర్ణయాన్ని, కాంగ్రెస్ నియామకాల్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా తమను MLCలుగా నియమించేలా ఉత్తర్వులివ్వాలని పిటిషన్లో శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంను కోరారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం.. అప్పట్నుంచి విచారణ జరుపుతోంది. https://justpostnews.com