రోజూ 10 వేల కుక్కకాట్లుండగా, ఏటా 37 లక్షల మంది గాయపడుతున్నారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. WHO లెక్కల ప్రకారం ఏటా 20 వేల మంది రేబిస్(Rabies)తో చనిపోతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. వాటి తరలింపును అడ్డుకునే పిటిషన్లను గుర్తు చేస్తూ.. మాంసం(Non-Veg) తినే వ్యక్తులు సైతం జంతు ప్రేమికులమని చెప్పుకుంటున్నారన్నారు. ఢిల్లీ NCR పరిధిలో శునకాల్ని తరలించాల్సిందేనన్న జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ బెంచ్ ఆదేశాలపై CJIకి లేఖలు అందాయి. దీంతో ఈ కేసు ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ అయింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా బెంచ్.. పోటాపోటీ వాదనల తర్వాత తమ ఆదేశాల్ని రిజర్వ్ చేసింది.