ఉన్నట్టుండి కుంభవృష్టి కురవడం, భారీగా వచ్చిన వరదలతో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకశ్మీర్ మాచెయిల్ మాత(Machail Matha) యాత్రలో దుర్ఘటన జరిగింది. కిష్ట్వార్(Kishtwar) జిల్లాలోని పద్దార్ రీజియన్లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడి కుంభవృష్టి కురిసింది. ఛసోటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందని, ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సహాయ చర్యల కోసం పోలీసు, ఆర్మీని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రంగంలోకి దింపారు.