దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) ప్రసంగంలో మోదీ ప్రకటించడంపై చర్చ మొదలైంది. ‘ఈసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం.. GSTలో భారీ మార్పులు తర్వాతి జనరేషన్ కు ఎంతో ఉపయోగం.. దేశ ప్రజలందరిపై పన్ను భారం తగ్గిస్తుంది..’ అని స్పష్టం చేశారు. 2017 జులై 1న మొదలైన GST 8 వసంతాలు పూర్తి చేసుకుంది. సామాన్యుడికి అనుకూల రీతిలో పన్నులు తగ్గేలా సరికొత్త GSTని హైపవర్ కమిటీ తయారు చేసింది. తాజా మార్పులతో నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి. ఈసారి 103 నిమిషాలు(గంటా 43 నిమిషాలు) మాట్లాడిన ఆయన.. గతేడాది రికార్డ్(98 నిమిషాల)ను అధిగమించారు. మాజీ ప్రధాని నెహ్రూ 1947 నాటి 72 నిమిషాల స్పీచ్.. 2015(88 నిమిషాల మోదీ స్పీచ్) వరకు రికార్డుగా ఉండేది.