అక్రమ వలసదారుల(Illegal Immigrants) ఏరివేతకు ప్రత్యేక మిషన్ ను ప్రకటించారు ప్రధాని మోదీ. దేశ జనాభాను మార్చే కుట్ర జరుగుతోందన్నారు. ఆయన మాటల్లోనే… ‘ఒక ఆందోళన, సవాల్ గురించి ప్రజలను అప్రమత్తం చేయాలనుకుంటున్నా.. దేశ జనాభా మారుతోంది.. కొత్త సంక్షోభానికి అడుగులు పడుతున్నాయి.. దేశ యువత జీవనోపాధిని ఈ చొరబాటుదారులు లాక్కుంటున్నారు.. మా అక్కాచెళ్లెల్లు, కుమార్తెలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. ఆదివాసీలను తప్పుదారి పట్టించి భూములు లాక్కుంటున్నారు.. దీన్ని సహించబోం.. సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పవుతున్నాయి.. అందుకే మేము ప్రత్యేక మిషన్ తెస్తున్నాం..’.