GST సంస్కరణల్ని ప్రధాని ప్రకటించడంతో.. వచ్చే నెలలో జరిగే కౌన్సిల్ సమావేశం ఆసక్తికరం కాబోతుంది. సాధారణ పౌరులు, రైతులు, మధ్యతరగతితోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల(MSME)లకు ఉపశమనం కలిగేలా కొత్త GST రానుంది. జీవన సౌలభ్యం పేరిట జరిగే పన్ను రేట్ల సర్దుబాటు సంస్కరణల వివరాల్ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం 4 శ్లాబులు(5%, 12%, 18%, 28%) ఉండగా.. కొత్తదాంట్లో రెండే (5%, 18%) శ్లాబులు(Slabs) ఉంటాయి.
లక్ష్యాలిలా… https://justpostnews.com
@ స్థోమత, వినియోగం పెంచేందుకు వస్తువుల్ని మరింత అందుబాటులోకి తెచ్చేలా పన్నుల తగ్గింపు
@ చిన్న వ్యాపారాలు, స్టార్టప్ లు సజావుగా సాగేలా సులభతర రిజిస్ట్రేషన్
@ మాన్యువల్ జోక్యాన్ని తగ్గించి రిటర్నుల్ని వేగంగా పరిష్కరించడం
@ ప్రత్యేక రేట్లు కొన్ని వస్తువులకు మాత్రమే ఉంటాయి
@ 12% శ్లాబు తొలగింపుతో 99 శాతం వస్తువులు 5% శ్లాబులోకి వస్తాయి.
@ 28% శ్లాబు తీసేయడంతో 90 శాతం వస్తువులు 18% శ్లాబులోకి వచ్చి ప్రజలపై భారం తగ్గుతుంది.
@ తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి లగ్జరీ వస్తువులపై 40% పన్ను కొనసాగుతుంది.