భక్తి యాత్రలో అదో బేస్ క్యాంప్. ఆ ఆలయానికి చేరుకోవడానికి అక్కడే వేలాదిమంది రెస్ట్ తీసుకుంటారు. ఊహించని రీతిలో వచ్చిన ఉత్పాతం(Floods) భారీ నష్టాన్ని మిగిల్చినా.. అక్కడి ఆలయం(Temple) చెక్కుచెదరలేదు. కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లా ఛషోటిలో నిన్న క్లౌడ్ బరస్ట్ జరిగి క్షణాల్లో వరదలు వచ్చాయి. మచెయిల్ మాత దర్శన బేస్ క్యాంపుగా ప్రసిద్ధి చెందిన ఛషోటిలో వరదలకు భవనాలు కూలి 60 మంది చనిపోయారు. 160 మందిని కాపాడితే అందులో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా వందల మంది శిథిలాల్లో చిక్కుకున్నారని భావిస్తున్నారు. కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అంతటి భారీ ఉత్పాతంలోనూ అక్కడి గుడి భద్రంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.