దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-1తో గెలుచుకుంది ఆస్ట్రేలియా(Australia). డెవాల్డ్ బ్రెవిస్(53) ఫిఫ్టీతో తొలుత సౌతాఫ్రికా 172/7 చేసింది. మార్ష్(54) సహా అంతా ఔటైనా ధనాధన్ ఇన్నింగ్స్ తో మాక్స్ వెల్(62 నాటౌట్) గెలిపించాడు. 162/6 గల ఆసీస్ కాస్తా 163/8కి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కానీ తానున్నానంటూ మ్యాక్సీ నిలవడంతో 2 వికెట్లతో ఆస్ట్రేలియాదే విజయమైంది. తొలి మ్యాచ్ లో కంగారూలు, రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలిచాయి.