రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. భారీగా వరద వస్తున్నా నీటిని తరలించట్లేదని విమర్శించారు. ఇప్పటికీ 60% డ్యాంలు ఖాళీగా ఉన్నాయన్నారు. నందిమేడారం గాయత్రి పంపుహౌజ్ ల ద్వారా రోజూ 2 TMCల్ని మిడ్ మానేరుకు తరలించొచ్చని కానీ పట్టించుకోవట్లేదన్నారు. అన్నపూర్ణ, మలన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లతోపాటు చెరువులకు మోటార్ల ద్వారా నీటిని అందించాలన్నారు. ఎల్లంపల్లికి 62 వేల క్యూసెక్కులు వస్తున్నా తరలించకుండా గేట్లు ఎత్తి సముద్రం పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నీటిని తరలించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు.