ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికే NDA అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, తామూ సై అంటూ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించుతోంది ఇండీ కూటమి. భారతదేశ రెండో అత్యున్నత పదవికి పోటీపడుతున్న ఈ ఇద్దరూ దక్షిణాది వాసులే. రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు తిరుప్పూర్(Tiruppur) కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పుట్టింది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారంలో. ఈ విశ్రాంత న్యాయమూర్తి గోవా లోకాయుక్తతోపాటు హైకోర్టులు, సుప్రీంకోర్టులో సేవలందించారు. ఇలా దక్షిణాది నుంచే ఈసారి ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. https://justpostnews.com