ఆసియా కప్ టోర్నీలో ఆడే ఆటగాళ్ల పేర్లను భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 9 నుంచి ఈ టీ20 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు.
జట్టు ఇదే…:
సూర్యకుమార్(C), గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), బుమ్రా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూసింగ్