విద్యుదాఘాతానికి గురై ఈమధ్యకాలంలోనే 8 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని సర్కారు సీరియస్ గా తీసుకుంది. కరెంటు వైర్లున్న చోట గందరగోళంగా తయారైన కేబుల్ వైర్లను తొలగించాలని ఆదేశించింది. విద్యుత్తు అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ CM, ఆ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వీలైనంత వెంటనే కేబుల్ వైర్లు తొలగించాలన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ఎంత చెప్పినా చెవికెక్కడం లేదన్న భట్టి.. ప్రతి చోటా వేలాడుతున్న కేబుల్ వైర్లను పీకిపారేయాలని ఆదేశాలిచ్చారు. ఏడాది కాలం సమయమిచ్చినా కేబుల్ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు.