63 డిమాండ్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యోగుల JAC.. బస్సు యాత్రకు సిద్ధమైంది. పెండింగ్ బిల్లుల మంజూరు, PRC అమలు, EHS అమలు వంటి డిమాండ్లపై.. TNGO భవనల్లో TGEJAC కార్యనిర్వాహక కమిటీ సమావేశమైంది. పాత పెన్షన్ సాధన సదస్సును సెప్టెంబరు 1న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తారు. 33 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలతోపాటు ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్రల్ని సెప్టెంబరు 8 నుంచి చేపడతారు. చివరగా అక్టోబరు 12న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని TGEJAC ప్రకటించింది.
తేదీల వారీగా యాత్రలిలా…
సెప్టెంబరు 8…: వరంగల్
సెప్టెంబరు 9…: కరీంనగర్
సెప్టెంబరు 10…: ఆదిలాబాద్
సెప్టెంబరు 11…: నిజామాబాద్
సెప్టెంబరు 12…: సంగారెడ్డి, మెదక్
సెప్టెంబరు 15…: వికారాబాద్, రంగారెడ్డి
సెప్టెంబరు 16…: మహబూబ్ నగర్
సెప్టెంబరు 17…: నల్గొండ https://justpostnews.com
సెప్టెంబరు 18…: ఖమ్మం, కొత్తగూడెం
సెప్టెంబరు 19 నుంచి మిగతా జిల్లాల్లో(ఇంకా ప్రకటించలేదు).