మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన మేనల్లుడైన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం(Kaleswaram) నిర్మాణాలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది హైకోర్టు(High Court) రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. విచారణ చేపట్టేందుకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ కు అర్హతే లేదని ఆ ఇద్దరు పిటిషన్లో తెలియజేశారు. 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు కాగా, 2025 జులై 31న గడువు ముగిసింది. అంతకుముందు ఈ కమిషన్ గడువును ఏడుసార్లు పొడిగించారు.