వీఆర్ఏల క్రమబద్ధీకరణ(Regularization), సర్దుబాటు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వారి విద్యార్హతను బట్టి 4 శాఖల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల్లో సర్దుబాటుకు అవకాశం ఉందని ఉన్నతాధికారులు CMకు వివరించారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు ఆర్డర్స్ రిలీజయ్యే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. VRA వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ CM నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల్లో వివిధ రకాల క్వాలిఫికేషన్ కలిగినవారు ఉన్నారని, వారి ఎలిజిబిలిటీ(Eligibility)ని బట్టి ఉద్యోగ కేటగిరీలను ప్రభుత్వం నిర్ధారిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
గైడ్ లైన్స్ కు అనుగుణంగానే సదరు నాలుగు శాఖల్లో వారిని భర్తీ చేయాలని ఆదేశించారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చే విషయంలో.. 2014 జూన్ 2 తర్వాత విధుల్లో మరణించిన VRAల వారసులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉద్యోగమివ్వాలన్నారు.