భారీ సుంకాల(Tariffs)తో భారత్ ను భయపెట్టాలని అమెరికా చూస్తే.. రష్యా మాత్రం తన నమ్మకాన్ని కాపాడుకుంటూనే ఉంది. ‘US మార్కెట్లోకి భారత వస్తువులు వెళ్లకపోతే మా తలుపులు తెరిచి ఘనంగా స్వాగతిస్తాం.. ఇది భారత్ కు ఛాలెంజింగ్.. మా ఇద్దరి స్నేహం ఎంతో బలమైంది.. ఎంతమందొచ్చినా ఆపలేరు.. మా క్రూడాయిల్ కు భారత్ అతిపెద్ద దిగుమతిదారు.. మేం వారికోసం ఏదైనా చేస్తాం..’ అని ఆ దేశ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్(Babushkin) అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ ను బెదిరించడమే ట్రంప్ వ్యూహమని US ప్రతినిధి కరోలిన్ లెవిట్ చెప్పిన కొన్ని గంటల్లోనే రష్యా ఇలా స్పందించింది. మరోవైపు చమురుపై మోదీ సర్కారుకు 5% రాయితీ ఇస్తోంది పుతిన్ సర్కారు. అమెరికా కుయుక్తులకు రగిలిపోతున్న రష్యా-భారత్-చైనా త్వరలోనే త్రైపాక్షిక భేటీ జరపబోతున్నాయి.