అంగన్వాడీ(Anganwadi) పిల్లలకు కొత్త విధానం అమలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. అన్ని అంగన్వాడీల్లో అల్పాహారం(బ్రేక్ ఫాస్ట్) ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని 139 కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ విధానంతో 30 శాతం పిల్లల హాజరు పెరిగినందున ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు అధికారుల సమీక్షలో మంత్రి స్పష్టం చేశారు. పోషకాహారాన్ని మెరుగుపర్చేందుకు ప్రతి చిన్నారికి పొద్దున 100 మి.లీ. పాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి వారం ఒకరోజు ఎగ్ బిర్యాని(Egg Biryani), ఒకరోజు వెజిటెబుల్ కిచిడీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com