కేబుల్ వైర్లతో ప్రాణాలు పోతే బాధ్యులెవరని హైకోర్టు ప్రశ్నించింది. GHMCలో కేబుళ్ల తొలగింపుపై భారతీ ఎయిర్ టెల్(Airtel) వేసిన అత్యవసర పిటిషన్ పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. కేంద్రం, రాష్ట్రం, GHMC, సర్వీస్ ప్రొవైడర్లు.. ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా అని కోర్టు నిలదీసింది. దీనికి అందరూ బాధ్యులేనని గుర్తుచేసింది. స్తంభాల కోసం డబ్బిస్తున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. నోటీసులివ్వకుండా కట్ చేయడంతో ఇంటర్నెట్ లేకుండా పోయిందన్నారు. అయితే పరిమితికి మించి వైర్లు ఉన్నందునే కట్ చేశామని TGSPDCL వాదించింది. దీంతో TGSPDCL, GHMCకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేబుళ్లు తొలగించొద్దని ఆదేశించింది.