ఉర్ఫీ జావెద్… ఈ పేరే ఇంటర్నెట్ సంచలనం. ఇన్ స్టాగ్రామ్ లో 4.2 మిలియన్లు(42 లక్షల మంది) ఫాలోవర్లు ఆమె సొంతం. అసాధారణ డ్రెస్సింగ్, వెరైటీ స్టైల్, కురచ దుస్తులతో కుర్రకారు మతి పోగొట్టే ఈ సుందరాంగికి ప్రత్యక్షంగా చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ జర్నీలో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది.’ముంబయి నుంచి గోవా కు ఫ్లైట్ లో వెళ్తున్న నన్ను కొంతమంది వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. మద్యం మత్తులో తనను పేరుతో పిలుస్తూ, వల్గర్ గా మాట్లాడుతూ టీజ్ చేశారంటూ’ వాపోయింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను షేర్(share) చేసింది. ‘ఈ వీడియోలోని వ్యక్తులు నన్ను రకరకాల పేర్లతో టీజ్ చేస్తున్నారు.. నేను వారిని వారించినపుడు అందులో ఒకడు బాగా తాగి ఉన్నాడని అర్థమైంది.. అతడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా మద్యం మత్తులో ఏదేదో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మందు తాగి లేడీస్ తో అసభ్యంగా మాట్లాడటం సరికాదు.. పబ్లిక్ ఫిగర్ ను.. పబ్లిక్ ప్రాపర్టీ NO’ అంటూ ఆ పోస్టులో కామెంట్ చేసింది.
తన సీటు వెనుక కూర్చున్న సదరు వ్యక్తులు తాగుబోతులుగా సంబోధిస్తూ అలా ఫ్లైట్ జర్నీలో అతి భయంకరమైన సిట్యుయేషన్ ను ఎదుర్కొన్నానని ఉర్ఫీ జావెద్ వాపోయింది. ‘బిగ్ బాస్ OTT’లో కనిపించిన తర్వాత ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైంది. విచిత్రమైన ఫ్యాషన్ వల్ల నిరంతర ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నానని తెలిపింది. ‘నేను పాపులారిటీ సాధించానా..? YES. కీర్తి…? YES. పని…? లేదు. ప్రజలు నన్ను గౌరవించరు.. ప్రజలు నాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు’ అంటూ ఘాటైన రీతిలో షేర్ చేసుకుంది.
ఇంకా ఆమె ఏమందంటే.. ‘నేను మనిషిని కాబట్టే కలత చెందుతున్నాను.. కానీ ఇప్పుడు నేను కలత చెందడం 5-10 నిమిషాల వరకే ఉంటుంది. అగ్లీగా ఉన్నానని, చాలా అందంగా ఉన్నానని నాకు నేనే అనుకుంటాను’ అని మనసులో మాట బయటపెట్టింది. ‘లవ్, సెక్స్ ఔర్ దోఖా 2’ సినిమాతో బాలీవుడ్ లో ఉర్ఫీ ఎంట్రీ ఇవ్వబోతున్నదని ప్రచారం జరుగుతోంది.