జీవిత బీమా, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు ప్రజలకు చేరువ కావాలంటే పన్ను మినహాయింపు ఉండాలని రాష్ట్రం గుర్తు చేసింది. ఈ విషయాన్ని డిప్యూటీ CM భట్టి విక్రమార్క.. GST కౌన్సిల్ భేటీలో ప్రస్తావించారు. పాలసీలు, రీ-ఇన్సూరెన్సులపై పన్ను మినహాయింపు ప్రయోజనం నిజంగా ప్రజలకు చేరేలా ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రాష్ట్రాలకు కొంతమేర ఆదాయం తగ్గి సంక్షేమ పథకాలకు కష్టమేర్పడినా ఇన్సురెన్సుదారులకు ఉపయోగపడితే చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 95 లక్షల కుటుంబాలకు బీమా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన GST కౌన్సిల్ మంత్రుల సమూహం(GoM)లో 13 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.