పురపాలక(Municipal) శాఖలో పెద్దసంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. సెలక్షన్ గ్రేడ్, అడిషనల్(Additional), స్పెషల్ గ్రేడ్ సహా మొత్తం 47 మందికి స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టి.కె.శ్రీదేవి ఉత్తర్వులిచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎన్.యాదగిరిరావు, మీర్ పేట్ కమిషనర్ గా ఎ.నాగమణి, నారాయణపేట కమిషనర్ గా జి.నర్సయ్య, మంచిర్యాల కమిషనర్ గా కె.సంపత్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు.