ప్రతి సమస్యను సుప్రీంకోర్టు(Supreme Court) పరిష్కరించాల్సిన అవసరం లేదని కేంద్రం అభిప్రాయపడింది. కొన్నింటిని రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రే చూసుకోవాలని సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంపై మూడోరోజు విచారణ జరిగింది. కొంతమంది గవర్నర్లు బిల్లుల్ని ఆపేస్తే న్యాయపర సమాధానం కంటే రాజకీయ పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్(SG) తుషార్ మెహతా వాదించారు. కాలక్రమం నిర్దేశించే అధికార పరిధిని కోర్టులకు రాజ్యాంగం ఇవ్వలేదన్నారు. గవర్నర్లతో సామరస్యంగా పరిష్కరించుకునే ప్రజాప్రతినిధులున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్లు పంపే వీలు లేదని నిన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.