లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ACB)కి దొరికిపోయారు మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్(Armoor) MVI గుర్రం వివేకానంద రెడ్డితోపాటు ఆయన ప్రైవేట్ డ్రైవర్ నెల్లి తిరుపతి పట్టుబడ్డారు. రూ.25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్, లర్నింగ్ లైసెన్సుల జారీకి లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ACB అధికారుల్ని ఆశ్రయించడంతో వలపన్ని MVIని పట్టుకున్నారు.