హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజీ బోర్డు ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. HMWSSBలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు PRC అమలు చేస్తూ ముఖ్యమంత్రి KCR నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం PRC అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 4,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ సాధ్యమైనంత త్వరగా రెడీ చేయాలని సీఎం ఆదేశించారు.
తమకు పీఆర్సీ అమలు చేయడం పట్ల మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ లీడర్లు, సిబ్బంది.. ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.