శ్రీరాంసాగర్(Sriram Sagar) ప్రాజెక్టుకు వరద నీరు వస్తూనే ఉంది. ఇన్ ఫ్లో 80 వేల క్యూసెక్కులుండగా, 78 వేలకు పైగా క్యూసెక్కుల్ని వదులుతున్నారు. జలాశయం నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులు దాటింది. పూర్తి నీటి నిల్వ 80.5 TMCలకు గాను ప్రస్తుతం 79.65 టీఎంసీలకు చేరింది. 16 గేట్ల ద్వారా 49 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 6,500, ఇందిరమ్మ కాల్వ ద్వారా 20 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలిపెడుతున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకోగా.. నాగార్జునసాగర్ కు 4.45 లక్షల ఇన్ ఫ్లో వస్తుండగా, 4.18 లక్షల ఔట్ ఫ్లో ఉంది.