జస్టిస్ పి.సి.ఘోష్(Ghosh) కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ KCR, హరీశ్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో భిన్నమైన పరిస్థితి కనిపించింది. మధ్యంతర ఉత్తర్వులు నిరాకరించడంతో కేసీఆర్, హరీశ్ కు నిరాశ.. రిపోర్ట్ బయటపెట్టడంపై సర్కారుకు చురక అన్నట్లుగా సాగింది. అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని మంత్రిమండలి తీర్మానించాక రిపోర్టును ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ డొమైన్లలో ఉన్నవాటిని తొలగించాలని ఆదేశించింది. అసెంబ్లీలో చర్చించనున్నందున స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని AG వాదించారు. కౌంటర్ దాఖలుకు CS, ఇరిగేషన్ సెక్రటరీ, పి.సి.ఘోష్ కమిషన్ కు 3 వారాల గడువిచ్చింది. ఈ 3 కౌంటర్లు వేశాక వాటికి బదులు కౌంటర్ కు గాను కేసీఆర్, హరీశ్ కు మరో వారం గడువు కేటాయించింది. మొత్తంగా ఈ కేసు తదుపరి విచారణ 5 వారాల తర్వాత జరగనుంది.