లంచం తీసుకుంటూ ఇద్దరు రిజిస్ట్రేషన్ అధికారులు ACBకి పట్టుబడ్డారు. ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని రెండు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఆదిలాబాద్(Adilabad) స్టాంప్స్, రిజిస్ట్రేషన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరెడ్డి.. రూ.5 వేలు తీసుకుంటూ చిక్కారు. భార్య పేరున గల ఇంటిని గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె భర్త ACBని ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఎస్.రాజేశ్ కుమార్ సైతం ఆస్తి రిజిస్ట్రేషన్ కు లక్ష డిమాండ్ చేశారు. అందులో రూ.70 వేలను డాక్యుమెంట్ రైటర్ వద్ద పనిచేసే టైపిస్టు కె.రమేశ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.