రూ.2 వేల కోట్ల కేసులో బ్యాంకు మోసానికి పాల్పడ్డారంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCOM) ప్రమోటర్, డైరెక్టర్ అనిల్ అంబానీ నివాసాల్లో CBI దాడులకు దిగింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. రుణాల వినియోగంలో మోసాలు జరిగాయని, పలు గ్రూపులకు అవి చేరినట్లు అనుమానాలున్నట్లు ఆర్ కామ్ కు SBI రాసిన లేఖలో తెలిపింది. రూ.3 వేల కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఇప్పటికే అనిల్ అంబానీ గ్రూపుపై ED దాడులకు దిగిన కొద్ది వారాలకే CBI దృష్టిపడింది. 2017-19 కాలంలో యెస్(Yes) బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుని క్విడ్-ప్రో-కో(నీకింత-నాకింత) కింద రాగా(RAAGA) కంపెనీలకు మళ్లించారన్న కేసులో అంబానీ గ్రూపునకు చెందిన బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ MD పార్థసారధి బిశ్వాల్ అరెస్టయ్యారు.