ఆన్లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ కోసం సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్(Gangtok)కు అనుచరులతో కలిసి వెళ్తుండగా MLA పట్టుబడ్డారు. క్యాసినో(Casino) కింగ్ గా భావిస్తున్న కర్ణాటక కాంగ్రెస్ MLA కె.సి.వీరేంద్రను ED అరెస్టు చేసింది. 30 చోట్ల దాడులు చేసి రూ.12 కోట్లు స్వాధీనం చేసుకుంది. రూ.6 కోట్ల బంగారు నగలు, 10 కిలోల వెండి, రూ.కోటి విదేశీ కరెన్సీ అందులో ఉన్నాయి. 17 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి.. వీరేంద్ర సోదరుడు కె.సి.నాగరాజ్, ఆయన కుమారుడు ఎన్.రాజ్ నుంచి భారీగా డాక్యుమెంట్లను ED స్వాధీనం చేసుకుంది. చిత్రదుర్గ MLA వీరేంద్ర గ్యాంగ్ టక్ లో అరెస్టు కాగా, ఆయన సహచరులిద్దరు దుబాయ్ నుంచి ఆన్ లైన్ గేమింగ్ నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
MLA వీరేంద్రవని భావిస్తున్న పప్పీస్ క్యానినో గోల్డ్, ఓషెన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషెన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోల్లో సోదాలు జరిగాయి. బెంగళూరు, గోవా, ముంబయి సహా వివిధ నగరాల్లో దాడులు చేయగా.. కింగ్567, రాజా567, పప్పీస్003, రత్న గేమింగ్ వంటి ఆన్లైన్ సైట్స్ ఉన్నట్లు ED గుర్తించింది.