వీధికుక్కల్ని షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ మరుసటిరోజే శునకాల బీభత్సం బయటపడింది. BBA విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసి ఆమెను పీక్కుతిన్నాయి. చెంప(Cheek) రెండు భాగాలుగా చీలిపోతే, ముక్కు నుంచి మాంసం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్(Kanpur)లో ఇది జరిగింది. మధుబన్ పార్క్ సమీపంలో కోతులు, కుక్కలు కొట్లాడుకుంటున్నాయి. ఆ టైంలో అటుగా వెళ్తున్న వైష్ణవి సాహు మీదకు వచ్చి గట్టిగా నేలకేసి కొట్టాయి. అరుపులు విన్న పలువురు కర్రలతో అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. కుక్కల దాడిలో రక్తసిక్తమైన వైష్ణవికి 17 కుట్లు పడ్డాయి.