దుమ్ముతో నిండిన వీధులు.. చిరిగిన శాలువా(Torn Shawl).. నాణేలు సేకరిస్తూ, సందుల్లో తిరుగుతూ బిచ్చగాడిలా మారడం వెనుక ఒక మేథస్సు ఉంది. ఆయనే ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval). పాక్ అణ్వస్త్ర పరిశోధనను వెలికితీయడానికి ఆరేళ్లు ప్రమాదంలో బతికారు. భారతదేశానికి దీటుగా దాయాది దేశం.. చైనా సాయంతో అణ్వస్త్రాలకు సిద్ధమైంది. దీన్ని ప్రపంచానికి చాటాలంటే తగిన రుజువులు అవసరం. ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్(KRL) గల ఇస్లామాబాద్ కహుతా పట్టణం.. శాస్త్రవేత్తలు,అధికారులు, సెక్యూరిటీతో శత్రుదుర్భేద్యంగా మారింది. అలాంటి టైంలో నెలల పాటు కనిపించకుండా పోయారు దోవల్.
ఒక చిన్న సెలూన్ లో పురోగతి కనపడింది. సైంటిస్టుల వెంట్రుకల్ని జాగ్రత్తగా సేకరించడం మొదలుపెట్టి ఆ నమూనాల్ని విశ్లేషణ కోసం భారత్ పంపారు. ఈ పరీక్షలే.. యురేనియం, రేడియేషన్ జాడల్ని కనిపెట్టాయి. అలా పాక్ అణు యుక్తుల్ని ప్రపంచానికి చాటడం ద్వారా ఆ దేశం మరో 15 ఏళ్లపాటు పరీక్షలు నిర్వహించకుండా ఆపగలిగారు అజిత్ దోవల్.