భారత్ పై అమెరికా సుంకాల తర్వాత ఇరుదేశాల మధ్య కీలక పరిణామాలు జరిగాయి. దీనిపై కోపంతో ఉన్న మోదీ.. ట్రంప్ 4 ఫోన్ కాల్స్ ను పట్టించుకోలేదట. బ్రెజిల్ తర్వాత భారత్ పైనే అత్యధిక టారిఫ్స్(50 శాతం) పడ్డాయి. గత కొన్ని రోజుల్లో 4 సార్లు ట్రంప్ కాల్ చేసినా ప్రధాని స్పందించలేదని జర్మన్ పత్రిక ‘ఫ్రాంక్ ఫర్టర్ అల్జెమీన్ జీటంగ్(Allgemeine Zeitung)’ వెల్లడించింది. ఇది అవమానకరమని, USకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదన్న భావన మోదీలో ఉన్నట్లు రాసింది. పాక్ తో సంబంధాలు వాషింగ్టన్ దృక్పథాన్ని మార్చాయని, యుద్ధం తామే ఆపామంటూ ట్రంప్ గంభీరాలు పలకడం కూడా మోదీ ధిక్కార స్వరానికి కారణమని జపాన్ పత్రిక ‘నిక్కీ(Nikkei) ఏషియా’ వార్తను ప్రచురించింది.