భారీ వర్షాలతో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో(Universities) పరీక్షలు వాయిదా పడ్డాయి. కాకతీయ(Kakatiya) వర్సిటీలో ఈరోజు, రేపు జరగాల్సిన డిగ్రీ, PG పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శాతవాహన వర్సిటీ పరిధిలో నేడు బీఎడ్, ఎంఎడ్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. వాయిదా వేసిన ఈ పరీక్షల్ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలోనే ప్రకటిస్తామని ఆయా విశ్వవిద్యాలయాలు తెలిపాయి.