ఎరువుల పంపిణీపై ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహానికి గురైన MLA.. ఏకంగా కలెక్టర్ పై చేయి ఎత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో జరిగింది. రైతులకు రెండు బస్తాలేనా అంటూ భింద్(Bhind) MLA నరేంద్రసింగ్ కుష్వాహ.. కలెక్టర్ నివాసానికి చేరుకున్నారు. కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ బయటకు రాకపోవడంతో బలవంతంగా లోపలికి ప్రవేశించారు. ‘ఈరోజు ప్రజల్ని మీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాను’ అంటూ మండిపడ్డారు.
అవినీతి, దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రతి శాఖను దోపిడీ చేస్తున్న శ్రీవాస్తవను తొలగించాలంటూ నినాదాలు చేశారు. కోపంతో ఊగిపోతూ కలెక్టర్ పై చేయి ఎత్తిన వీడియో వైరలైంది. జిల్లా SP సముదాయించినా వినకపోగా.. చివరకు సర్కారు జోక్యం చేసుకోవడంతో MLA వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం BJP శాసనసభ్యుడు కాగా.. గతంలో పలు పార్టీలు మారారు.