గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎంతకూ తగ్గేలా కనిపించడం లేదు. అల్పపీడన ప్రభావంతో కంటిన్యూగా వానలు పడుతున్నాయి. నిన్నట్నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు 44 సెంటీమీటర్లు నమోదైంది. ఇక.. పొద్దున 8:30 నుంచి 11 గంటల వరకు 15 సెంటీమీటర్ల వరకు రికార్డయింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 14.9, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి(Tumpally)లో 14.9, అదే మండలం చిమన్ పల్లి(Chimanpally)లో 13.2, సిరికొండ మండల కేంద్రంలో 12.4 సెంటీమీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోనూ 6.5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వాన పడింది.