విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ఉద్యోగులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10:40 దాటినా డ్యూటీల్లో ఉండకపోవడంపై మండిపడ్డారు. తన పరిధిలోని విభాగాలు, కార్పొరేషన్లపై వ్యవసాయ శాఖ(Agriculture) మంత్రి తుమ్మల.. సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. పదిన్నరకు హాజరవ్వాల్సిన సిబ్బంది సమయం దాటినా రాకపోవడంతో మంత్రికి కోపమొచ్చింది. సకాలంలో రాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని, అసలే హాజరు కాని అధికారులపై శాఖాపర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీవర్షాల దృష్ట్యా రైతులందరికీ అందుబాటులో ఉండాల్సిన యంత్రాంగం.. నిర్లక్ష్యంగా ఉండటంపై తుమ్మలకు చిరాకు తెప్పించింది.