వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి KTR పలకరించుకున్నారు. సిరిసిల్ల(Siricilla) జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ఐదుగురు చిక్కుకున్నారు. బాధితుల్ని పరామర్శించాక వేరేచోటుకు వెళ్తూ కేంద్రమంత్రి వాహనాన్ని చూసి వెనక్కు తిరిగారు KTR. ఇద్దరూ అక్కడే కలుసుకుని ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సైనిక హెలికాప్టర్ తో గ్రామస్థులు సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రానికి 4 హెలికాప్టర్ల రాకకు సంజయ్ కృషి చేశారు. నిన్న ఆయన రక్షణ మంత్రితో మాట్లాడి, ఈరోజు సైన్యాధికారులతో సమన్వయం చేసుకుని ఛాపర్లను రప్పించారు. బాధితుల్ని బయటకు తెచ్చాక అక్కడున్నవారంతా కేకలు వేశారు. కేంద్రమంత్రి వల్లే బయటపడ్డామని బాధితులు సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు.