రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శతాబ్ది ఉత్సవాల వేళ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్(Bhagwat) సంచలన రీతిలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో వైరుధ్యాలు, పోరాటాలున్నా గొడవల్లేవన్నారు. ‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో మాకు మంచి సమన్వయముంది.. ఒక్క BJPయే కాదు, గత ప్రభుత్వాలతోనూ అలాగే ఉన్నాం.. కేంద్రంతో కొన్ని అంతర్గత వైరుధ్యాలున్నా గొడవల్లేవు.. సంస్కృతాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం.. నేర్చుకోవాలన్న తపనను సృష్టించాలే తప్ప బలవంతం చేయొద్దు.. వ్యతిరేకంగా మాట్లాడేవారిని తిరస్కరించడంతోనే మతోన్మాదం పెరిగింది..’ అని అన్నారు.