IAS అధికారి లోతేటి శివశంకర్ ను ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ చేయాలంటూ తెలంగాణకు కేంద్రం సూచించింది. APకి కేటాయించాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిందేనని, వెంటనే రిలీవ్ చేయాలంటూ గతంలోనే క్యాట్ ఆదేశించింది. 2013 బ్యాచ్ కు చెందిన శివశంకర్ ది విజయనగరం జిల్లా ధర్మవరం. హైదరాబాద్(రంగారెడ్డి జిల్లా పరిధి)లోని తన మామ ఇంట్లో ఉండి సివిల్స్ చదివారు. UPSC దరఖాస్తులో దాన్నే అడ్రస్ గా ఇవ్వడంతో.. రాష్ట్ర విభజన సమయంలో ఆ చిరునామా ఆధారంగానే తెలంగాణకు కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకెళ్లారు.