మూడు కొత్త క్రిమినల్ చట్టాల్ని సవాల్ చేసిన పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై విచారణ చేపట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ మద్రాస్(Madras) హైకోర్టును ఆదేశించింది. అసమ్మతి నేరంగా, పోలీసులకు అనుకూలంగా కొత్త చట్టాలున్నాయని, న్యాయమైన విచారణ హక్కును దెబ్బతీస్తున్నాయన్నది తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ల వాదన. 2024 సెప్టెంబరులో నోటీసు ఇచ్చినా వాదనలకు అవకాశమివ్వలేదని, కేసును సుప్రీంకు బదిలీ చేయాలని కోరారు. భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS), భారతీయ సాక్ష్య అధికారియం(BSA) రూల్స్ పై విచారణ చేపట్టాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం ఆదేశించింది.