BCలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) నిర్ణయించింది. గత ప్రభుత్వం 2018లో తెచ్చిన 50% పరిమితిని ఎత్తివేయనుంది. ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ కు పంపిన రిజర్వేషన్ల బిల్లుల్ని రేపు అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవాలని తీర్మానించింది. గవర్నర్ కోటా MLCలుగా కోదండరామ్, మహ్మద్ అజహరుద్దీన్ ను ఎంపిక చేసింది.
మిగతా నిర్ణయాలివే…
@ గోశాల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు
@ విపత్తుల్లో సాయమందించేలా ఆధునిక టెక్నాలజీతో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కొత్త వ్యవస్థ
@ 2022-23 రబీ నాటి 7 లక్షల మెట్రిక్ టన్నుల్ని మిల్లర్ల నుంచి రికవరీ చేయడం.. దారికిరాని వారిపై PD యాక్టు
@ మత్స్య సహకార సంఘాలకు పర్సనల్ ఇంఛార్జిల నియామకం.. ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారికే ఛాన్స్
@ వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్లతో సోమవారం సాయంత్రం సమావేశం