పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే గాజా, ఇరాన్ పై విరుచుకుపడ్డ నెతన్యాహూ సర్కారు.. యెమెన్(Yemen)పై దృష్టిపెట్టింది. నిన్నటి దాడిలో హూతీ(Houthi) కేబినెట్ మొత్తం హతమైందని IDF(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. రాజధాని సనా(Sanaa)పై దాడిలో ప్రధాని అహ్మద్ అల్-రహవి మృతిచెందినట్లు యెమెన్ కు చెందిన అల్-జుమ్హారియా ఛానల్, అడెన్ అల్-ఘద్ పత్రిక వార్తలు ఇచ్చాయి. ప్రధానిపై దాడి పూర్తయ్యాక మరో 10 మంది మంత్రులనూ IDF టార్గెట్ చేసింది. మంత్రులు భేటీ అయిన లొకేషన్ పై మిసైళ్లతో విరుచుకుపడింది. రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రాణాలు కోల్పోయారని IDF ప్రకటించింది.