ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 వేల పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మించాలని భావిస్తోంది. ఆగస్టు 29న జరిగిన 48వ వార్షిక సాధారణ సమావేశంలో నీతా అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. ముంబయి సముద్ర తీరాన అధునాతన సౌకర్యాలతో మెడికల్ సిటీ ఉండబోతోంది. AI పవర్డ్ డయాగ్నోస్టిక్స్, ప్రపంచ స్థాయి కట్టింగ్-ఎడ్జ్ మెడికల్ టెక్నాలజీ సౌకర్యాలుండేలా ప్లాన్ తయారవుతోంది. ఇందులోని మెడికల్ కాలేజీ తర్వాతి తరం వైద్యరంగానికి మైలురాయిగా నిలవాలన్నది నీతా కల. ఇది కార్యరూపం దాల్చితే భారత హెల్త్ సెక్టార్ మరింత బలంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు.