ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ సేవలపై కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ పలు సూచనలు చేశారు. అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘ఇవాళ పొద్దున్నుంచి ఆరోగ్య సేవలు బందయ్యాయి.. అధ్యక్షా ఆరోజు 5 లక్షలది 10 లక్షలు చేశాం ఆరోగ్యశ్రీకి. కానీ 5 లక్షలది కోటి రూపాయలు చేశామా, 20 కోట్లు చేసినమా అన్నది కాదధ్యక్షా.. కనీస బిల్లు ఇవ్వట్లేదు.. ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి ఎప్పుడు పోయినా సంపూర్ణ మద్దతిస్తారు.. మరి ఎక్కణ్నుంచి ప్లాబ్లం వస్తుందో నాకర్థం కావట్లేదు.. మా కోరుట్లలో 100 పడకల హాస్పిటల్ ఖాళీగా పడి ఉంది.. ఆరంభించి రెండు సంవత్సరాలైంది.. ఒక్క స్టాఫ్ లేరు..’ అని సంజయ్ గుర్తు చేశారు.