చేతుల్లో చేయి వేసి(Shake Hand) ముచ్చట.. ఆలింగనాల(Hugs)తో సందడి.. ఆప్యాయ పలకరింపులతో అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు భారత్-రష్యా-చైనా దేశాధినేతలు. షాంఘై సహకార సదస్సు(SCO) జరుగుతున్న టియాన్జిన్ లో మోదీ-పుతిన్-జిన్ పింగ్ పరస్పర పలకరింపులతో మొత్తం దృష్టంతా ఈ ముగ్గురిపైనే పడింది. తర్వాత మోదీ-పుతిన్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. రష్యాతో ఆయిల్ కొనుగోలు వల్ల భారత్ పై 50% ప్రతీకార సుంకాల్ని అమెరికా విధించడంతో ఈ మూడు దేశాలు ఏకమయ్యాయి. మోదీ-పుతిన్ కలిసి వెళ్తుండగా పాక్ ప్రధాని నిశ్చేష్టుడిలా నిల్చున్నారు. బాడీగార్డు మాదిరిగా ఆయన చూస్తూ ఉండిపోయారని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ హల్చల్ చేస్తున్నాయి.