రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. ఆ ప్రభావంతో ఈరోజు నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Very Heavy) ఉంటాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి(Peddapally) జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలుంటాయి. ఈ నెల 2న 13 జిల్లాల(భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్)కు, 3వ తేదీన నాలుగు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.