పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం విషయంలో KCRకు చెడ్డపేరు తెచ్చారని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ కు మరక అంటిందంటే హరీశ్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డియే కారణమన్నారు. హరీశ్, సంతోష్ తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించానని, KCRకు ఈ వయసులో CBI విచారణ ఏం ఖర్మ అంటూ ఆవేదన చెందారు. ఆ ఇద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతూనే ఉంటారని ఆరోపించారు. నీళ్ల కోసం KCR ఆలోచన చేస్తే వీళ్లు సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం పనిచేశారన్నారు.