ఇప్పటిదాకా అహంకారంతో విర్రవీగిన అమెరికా.. ఇప్పుడు దారికొస్తుందా అన్న అనుమానాలు కనపడుతున్నాయి. సుంకాల(Tariffs)తో భారత్ ను భయపెట్టాలని చూసిన అగ్రరాజ్యం(US).. మోదీ-పుతిన్-జిన్ పింగ్ భేటీతో అవాక్కయింది. దాని నిజస్వరూపం మారుతుందా అన్నది అలా ఉంచితే.. ‘భారత్ మాకు మంచి దోస్త్’.. 21 శతాబ్దం(Century)లో మా సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరాయి.. ఇరుదేశాల ప్రజల సాన్నిహిత్యంతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పడ్డాయి..’ అంటూ ట్వీట్ చేసింది. మూడు దేశాలు(భారత్-రష్యా-చైనా) ఏకమవడమే అమెరికా మంటకు కారణమైనా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.